యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్‌ ఎదుట బీజేపీ ధర్నా

కలం, యాదగిరిగుట్ట: మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం, టెండర్ల నిర్వహణ, వివిధ పనుల బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ (BJP) ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం (Yadagirigutta Municipal Office) ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కొత్త పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి మున్సిపాలిటీలో కోట్ల రూపాయల పనులు, బిల్లుల విషయంలో పారదర్శకత లేదని ఆరోపించారు. పలు పనులకు టెండర్లు నిర్వహించకుండా చైర్మన్, కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మున్సిపాలిటీలో జరుగుతున్న ఖర్చుల వివరాలను ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు కోరినప్పటికీ ఇప్పటివరకు అందించలేదని నాయకులు ఆరోపించారు. ఇంటి నంబర్లు, శానిటేషన్, కుక్కలు, కోతుల నియంత్రణ, స్ట్రీట్ లైట్ల నిర్వహణ, మొక్కల పంపిణీ తదితర అంశాల్లో బిల్లుల చెల్లింపులపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోడ రాధ, కౌన్సిలర్ మాధవి, జిల్లా కార్యవర్గ సభ్యులు భువనగిరి శ్యామ్, బెలిదే అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శులు నరేష్, సురేష్, ఉపాధ్యక్షులు చిత్తర్ల కృష్ణ, ఆలేటి కర్ణ, అవుల సత్యం, మంజుల, సీనియర్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, వాసు దేవరెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోడ బుచ్చిబాబు, శ్రీశైలం, అజయ్, దేవ, వినోద్, వంశీ, శ్రీనాథ్, నవీన్, శ్యామ్, ప్రవీణ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగ నాటకాలను తిప్పికొడతాం: బండి సంజయ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>