కలం, నిజామాబాద్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బీజేపీ నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎస్సీ మోర్చా (BJP SC Morcha) అధ్యక్షులు పురుషోత్తం ఆధ్వర్యంలో నిజామాబాబ్ ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. రాబోయో ఎన్నికల్లో ఎస్సీలకు 15% రిజర్వేషన్ పెంచాలని వినతి పత్రంలో కోరారు. జడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకోకుండా దళితులకు న్యాయం జరిగేలా తమ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా కోశాధికారి శివ, గజ్జల శంకర్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

