హిందువులను కించపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ హిందువులను కించపరుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) విమర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువులను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముస్లింలు అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లింలు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. హిందువులన్నా వారి మనోభావాలన్నా కాంగ్రెస్ పార్టీకి లెక్క లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. ఇటీవల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతల ప్రసంగాలు, అలాగే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఒకే తరహా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని వారు విమర్శించారు.

సోమనాథ్ ఆలయం అభివృద్ధి చేస్తాం: లక్ష్మణ్

సోమనాథ్ ఆలయ అభివృద్ధి అంశాన్ని లక్ష్మణ్ (Laxman) ప్రస్తావించారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి తీరుతామని  పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సోమనాథ్ ఆలయ సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ అంశాల్లో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని  పేర్కొన్నారు. కాంగ్రెస్ విధానాలు ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయం పెరుగుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>