కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఆకుల నరసయ్య (Akula Narsaiah) శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ప్రభుత్వ విప్ విజయ రమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నరసయ్యకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆకుల నరసయ్య మంత్రి పొన్నం, విప్ విజయ రమణారావును శాలువాలతో సత్కరించారు.
అలాగే మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ను నరసయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేతలు మాట్లాడుతూ.. కరీంనగర్ మార్కెట్ కమిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకుల నరసయ్యకు సూచించారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలవాలని పేర్కొన్నారు. అన్ని రకాలుగా వారి సమస్యలు తీరుస్తూ ఆదుకునేందుకు ముందుండాలని తెలిపారు.

