కాంగ్రెస్​ నాయకుల బంగారు గొలుసులు తెంపుకెళ్లండి: రాకేశ్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తె భగ్గు మనేలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య పొలిటికల్ హీట్ అగ్గిరాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. అటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘చలో అంకాపూర్’ కార్యక్రమానికి వినయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటిని కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వినయ్ కుమార్ రెడ్డి ముట్టడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులను సైతం ఆర్మూర్ పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఈ క్రమంలోనే అంకాపూర్ లోని తన నివాసంలో రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.

తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తులం బంగారానికి బదులుగా కాంగ్రెస్​ నాయకుల మెడలోని బంగారు గొలుసులు తీసుకెళ్లండి అంటూ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్​ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి తుంగులో తొక్కింది. అందుకే కాంగ్రెస్​ నాయకుల మెడలోని బంగారు గొలుసులు తెంపుకెళ్లండి.. పోలీసులు కేసులు పెడితే నా దగ్గరకు రండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>