ఏపీలో విజృంభిస్తున్న క‌రోనా.. మరో రెండు కేసులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ (AP)లో క‌రోనా మ‌హ‌మ్మారి చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు (COVID Cases) తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా మ‌రో రెండు కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గుంటూరు, విజ‌య‌వాడ‌లో ఇద్ద‌రికి క‌రోనా సోకిన‌ట్లు అధికారులు నిర్ధారించారు. గుంటూరు జీజీహెచ్‌లో బాపట్ల జిల్లా కర్లపాలానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయవాడ జీజీహెచ్‌లో తిరువూరుకు చెందిన‌ ఓ 13 ఏళ్ల బాలికకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తాజా కేసుల‌తో ఏపీలో కోవిడ్ బాధితుల సంఖ్య 16కే చేరుకుంది. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో న‌లుగురు బాధితుల‌కు చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోంది. మ‌రోవైపు ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. కోవిడ్ విష‌యంలో నిర్ల‌క్ష్యం ప‌నికి రాద‌ని, బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>