కలం, నిర్మల్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR)పై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ (Ravula Ramnath) అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో అనేక సార్లు ఓటరు జాబితాల సవరణ, సమగ్ర సర్వేలు చేపట్టిందని, ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపడుతున్న SIR ప్రక్రియను కాంగ్రెస్ వ్యతిరేకించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ గెలిచిన చోట SIR సక్రమంగా జరుగుతోందని, ఓడిన చోట మాత్రం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం సరికాదన్నారు. SIR వంటి ఎన్నికల ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని రాంనాథ్ (Ravula Ramnath) డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే SIRపై ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తిక్, కౌన్సిలర్లు గంజి రాజు, జింక సూరి, శ్రీరామోజు నరేష్ పాల్గొన్నారు.
Also Read : ”మా ఎమ్మెల్యే కనబడుట లేదు”.. బీజేపీ శ్రేణుల వినూత్న నిరసన!
Follow Us On : WhatsApp

