”మా ఎమ్మెల్యే కనబడుట లేదు”.. బీజేపీ శ్రేణుల వినూత్న నిరసన!

కలం, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదంటూ బీజేపీ (Warangal BJP) శ్రేణులు వినూత్న నిరసన చేపట్టాయి. ఎర్రబెల్లి ప్రదీప్ రావు (Errabelli Pradeep Rao) నివాసం నుంచి నూతన వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ వద్ద బూడిద గుమ్మడికాయలు కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా “మా ఎమ్మెల్యే కనబడుట లేదు” అంటూ ఫ్లెక్సీ కార్డులు ప్రదర్శించారు. నూతన కలెక్టరేట్‌ను బీజేపీ శ్రేణులే ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ ప్రజలకు అందుబాటులో లేరని విమర్శించారు. మూడేళ్లు గడుస్తున్నా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం కాలేదని, ఎంజీఎంలో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వరంగల్ జిల్లా కార్యాలయాలు ఇంకా హనుమకొండలోనే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: నీరు ధండా బంగారు గురి.. భారత్‌కు మరో గోల్డ్ మెడల్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>