వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు : రచ్చ శ్రీనివాస్

కలం, యాదగిరిగుట్ట: 6 గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలిందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్ (Rachcha Srinivas) అన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం, బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని రచ్చ శ్రీనివాస్ స్పష్టం చేసారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని వెల్లడించారు. హామీలు అమలు చేయని ప్రభుత్వానికి కేంద్రంపై మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>