కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేడు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పర్యటించనున్నారు. ఉదయం 7:40 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 9:20 గంటలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్తారు.
ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అక్కడ జరిగే బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ వేడుక ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా నుంచి తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.

