కలం, వెబ్ డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 8.15 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా 8.45 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్తారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సాంకేతికత, అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
సచివాలయంలో భేటీ అనంతరం, బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నివాసం సమీపంలోని ‘సంజీవని’ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ అరటి రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతికత వినియోగంపై వారితో చర్చించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రత్యేక విమానంలో బిల్ గేట్స్ ఢిల్లీకి బయలుదేరనున్నారు.


