కలం, వెబ్ డెస్క్ : చీర నచ్చలేదని ఓ యువతి (Bihar Bride) ఏకంగా పెళ్లి రద్దు చేసుకున్న వింత ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బల్లియా జిల్లా దాలన్ ఛప్రా గ్రామానికి చెందిన అజయ్ గోండ్ కుమార్తె కు మహదన్ పూర్ గ్రామానికి చెందిన పవన్ గోండ్ కుమారుడితో పెళ్లి ఖాయం చేశారు. ఈ నెల 11న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. వివాహం జరిగే కొద్ది నిమిషాల ముందు పెళ్లి కూతురు పెద్ద షాక్ ఇచ్చింది.
ఊరేగింపునకు ముందు తనకు పెళ్లికొడుకు తరఫున పెట్టిన చీర నచ్చలేదని వధువు (Bihar Bride) అభ్యంతరం వ్యక్తం చేసింది. పెళ్లి క్రతువు ముందుకు సాగడానికి నిరాకరించడంతో గొడవకు బీజం పడింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడడంతో వధువు తండ్రి అజయ్ గోండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

