Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’.. బిగ్ బాస్ కు పెరుగుతున్న పోటీ!

కలం, వెబ్ డెస్క్ : తెలుగు టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పదవ సీజన్ (Bigg Boss 10) త్వరలో ప్రారంభం కానుంది. వంద రోజుల పాటు కొనసాగే ఈ షోలో పాల్గొనేందుకు విపరీతమైన పోటీ నెలకొంది. తనను బిగ్ బాస్ 10వ సీజన్ కు తీసుకోవాలని ఏపీలోని నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి  ఓ వీడియో రిలీజ్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్లు తమను బిగ్ బాస్ 10వ సీజన్ లోకి తీసుకోవాలని అభ్యర్థిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ వెంకటేష్ నంగీ తనను 10వ సీజన్ కు తీసుకోవాలని బిగ్ బాస్ షో నిర్వాహకులను కోరారు. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం పరిధిలో రేణికుంట గ్రామానికి చెందిన తాను రైతును, కంటెంట్ క్రియెటర్ ను, యాక్టర్ ను.. ఆల్ రౌంటర్‌ను అని తెలిపారు. బీరన్న ఒగ్గు కథలు చెప్పే తాను బిగ్ బాస్ షోలో పాల్గొని అందరిని ఎంటర్ టైన్ చేస్తానన్నారు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతున్న తనకు బిగ్ బాస్ పదో సీజన్ లో ఛాన్స్ ఇవ్వాలని .. తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటానని చెప్పారు.

మరోవైపు ఏపీకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ రాజకుమారి సైతం తనను బిగ్ బాస్ 10వ సీజన్ లో తీసుకోవాలని అభ్యర్థించారు. ముగ్గురు పిల్లల తల్లినైన తాను యాక్సిడెంట్ లో ముఖం అందవిహీనంగా అయిపోయిన కూడా .. దృఢసంకల్పంతో ఇన్ స్టాగ్రామ్ లో తన ఫేస్ తో వీడియోలు తీసి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నానని చెప్పారు. భయం అనే షార్ట్ ఫిల్మ్ తో బెస్ట్ యాక్టర్ కు కూడా నిలిచానని పేర్కొన్నారు. తనదైన ఓర్పు, సహనం, ప్రతిభతో బిగ్ బాస్ షోలో విజేతగా నిలుస్తానని .. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని కోరారు. ఇప్పటికే షో కోసం చాలా రిక్వెస్ట్‌లు వస్తున్న వేళ బిగ్ బాస్ నిర్వహకులు 10వ సీజన్ కోసం ఎంపిక చేసే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>