ఇక భూ వివాదాలకు చెక్!: కేశంపేటలో ‘భూ భారతి’పై అవగాహన సదస్సు

కలం, వనపర్తి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘భూ భారతి–భూ సర్వే’ ( Bhu Bharathi)పై కేశంపేట గ్రామంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. తహసీల్దార్‌ సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్‌ బాదేపల్లి రేవతి సురేష్‌గౌడ్‌, సర్వేయర్‌ జీపీవో శేషయ్య పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టనున్న రీ-సర్వే ద్వారా భూముల హద్దులు స్పష్టమై, భూ వివాదాల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని అధికారులు తెలిపారు. రైతులు సర్వే సిబ్బందికి సహకరించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>