ప్రశ్నించే గొంతులను ఎమ్మెల్యే అణచివేస్తున్నారు: భోగ శ్రావణి

కలం, కరీంనగర్ బ్యూరో: ధర్మ బద్ధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే దీక్షను అడ్డుకోవడమే కాకుండా ప్రశ్నించే గొంతులను ఎమ్మెల్యే అణచివేస్తున్నారని జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి భోగ శ్రావణి (Bhoga Shravani) మండిపడ్డారు.ఈ నెల 18న ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టనున్న ‘ధర్మదీక్ష’కు అనుమతి నిరాకరించడంతో బీజేపీ నేతలు భోగ శ్రావణి ఆధ్వర్యంలో శనివారం తహసీల్ చౌరస్థలో ఆందోళనకు దిగారు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయించాలని బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో ధర్నా చేయగా పోలీసులు ఆమెతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తరలింపులో బోగ శ్రావణికి స్వల్ప గాయాలయ్యాయి.పోలీస్ స్టేషన్‌లోనూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు.

ఈ సందర్బంగా బోగ శ్రావణి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రియ విద్యాలయానికి స్థలం కేటాయించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈనెల 18 న జగిత్యాలలో ధర్మదీక్ష చేయడానికి అనుమతి నిరకరించారని, తాము శాంతి యుతంగా నిరసన తెలిపితే మహిళలని చూడకుండా పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.అరెస్ట్ సమయంలో నాతో పాటు పలువురు నాయకులకు గాయలయ్యాయని పోలీసుల తీరును తప్పుపట్టారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిరంకుశ వైఖరిని ఖండించారు. ప్రశ్నించే గొంతులను జగిత్యాల ఎమ్మెల్యే అణచివేస్తున్నారని ఆరోపించారు. కేంద్రియ విద్యాలయానికి స్థలం కేటాయించాలని ధర్మబద్ధంగా అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోందని మండిపడ్డారు.పెద్ద ఎత్తునా బీజేపీ నాయకులు చేపట్టిన నిరసన పోలీసుల అరెస్టు తో ఉద్రిక్తంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>