టీడీపీ, జనసేనకు షాక్.. ‘ఫ్రెండ్లీ ఫైట్’ ప్రకటించిన బీజేపీ!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాబు విషయంలో ఎన్డీయే కూటమి పార్టీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో కనీసం సమాచారం లేకుండా కూటమిలోని టీడీపీ, జనసేన నేతలు ఏకపక్షంగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమవరం మున్సిపాలిటీలో బీజేపీ బలంగా ఉందని , 1981 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ భీమవరం మున్సిపాలిటీలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉందని గుర్తు చేశారు.

అయితే మొత్తం 52 వార్డులున్న భీమవరం మున్సిపాలిటీలో బీజేపీకి కేవలం 5 వార్డులు మాత్రమే కేటాయించడమే కాకుండా, క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాలను కాదని వేరే స్థానాలను నిర్ణయించడం తమను అవమానించడమేనని కేంద్ర మంత్రి మండిపడ్డారు. అంతేకాకుండా, పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ కుమారుడికి కూడ సీటు కేటాయించపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఈ క్రమంలోనే కూటమిలో బీజేపీకి తగిన గౌరవం ఇవ్వకపోతే సహించేది లేదని శ్రీనివాస వర్మ హెచ్చరించారు. భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసే సత్తా తమ పార్టీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో ‘ఫ్రెండ్లీ ఫైట్’కు తాము సిద్ధమని ప్రకటించారు. కాగా, భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమిలోని టీడీపీకి 24, జనసేనకు 23, బీజేపీకి 5 వార్డులు కేటాయించారు. తమకు తక్కువ స్థానాలు కేటాయించడం పట్ల బీజేపీ నేత, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేసిన తాజా వ్యాఖ్యలు కూటమిలో పొలిటికల్ కాక రేపుతోంది. మరి భీమవరం సీట్ల సర్దుబాటు అంశంపై కూటమి నేతలు ఎలా ముందుకు వెళ్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

Also Read : ఏపీ పోలీసుల‌పై స‌జ్జ‌ల ఘాటు వ్యాఖ్య‌లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>