కలం వెబ్ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) డీఎస్పీ(DSP) జయసూర్యపై బదిలీ వేటు పడింది. గతంలో జయసూర్యపై భీమవరం జనసేన(Janasena) నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ఫిర్యాదులు చేశారు. ఆయన అసాంఘిక కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా పేకాట శిబిరాలకు అండగా ఉంటున్నారని, సివిల్ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ ఎస్పీకి ఫోన్ చేసి జయసూర్యపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. అతడి వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశించారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకూడదని సూచించారు. డీజీపీకి, హోం శాఖ మంత్రి అనితకు జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల గురించి తెలియజేయాలని చెప్పారు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది. భీమవరం నూతన డీఎస్పీగా రఘువీర్ ను నియమించారు.


