Mobile Popup Ad
Mobile Popup Ad

వివేకా హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila).. బాబాయ్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో అవినాష్‌కు వివేకానంద అడ్డుగా మారారని గ్రహించి, ఆయనను హత్య చేశారని ఆరోపించారు. సునీత భర్తే వివేకానందను హత్య చేయించాడని, చంద్రబాబు కోసం ఆమె పని చేస్తోందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా దుష్ప్రచారమని షర్మిల అన్నారు.

తనకు ప్రాణహాని ఉందని తెలిసినా సునీత (YS Sunitha) న్యాయం కోసం పోరాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక అన్నగా జగన్‌కు కనీస కనికరం కూడా లేదా అని ప్రశ్నించిన షర్మిల, బాధితుల పక్షాన నిలబడకుండా నిందితులకు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసులో నిజాలు బయటకు రావాలని, బాధితులకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>