కలం, వెబ్ డెస్క్: నేటి కాలంలో పెళ్లి అంటే కేవలం వేడుక మాత్రమే కాదు.. ప్రీ-వెడ్డింగ్ షూట్స్ కూడా. ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు చేయడం కామన్‌గా మారింది. కేరళలోని (Kerala) ఓ జంట కొత్తదనంతో ఉండాలనే ఉద్దేశ్యంతో బురదగా ఉన్న నీటి గుంతలో సినిమాటిక్ స్టైల్‌లో ఫోటో షూట్ జరుపుకుంది. నీటిలో ఆ జంట రొమాంటిక్ భంగిమల్లో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ జంట క్రియేటివిటీ ప్రయత్నం అందరినీ మెప్పించలేకపోయింది. ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షం కాగానే నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ జంట నీటిలో ఉన్న తీరు, ఫోటోగ్రాఫర్ ఎంచుకున్న లోకేషన్ చూసి నెటిజన్లు రకరకాలుగా విమర్శలు కురిపిస్తున్నారు. కొందరు దీన్ని అతిగా ఉందని కొట్టిపారేయగా, మరికొందరు ‘పెళ్లి ఫోటోల కోసం ఇంత సాహసాలు అవసరమా? అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. ఇది ప్రీ-వెడ్డింగ్ షూటా (Pre Wedding) లేక మరేదైనా విన్యాసమా?’ అని కూడా కామెంట్ చేశారు.

