కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా గాయకుడు గద్దర్ సతీమణి విమలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పరామర్శించారు. తమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. విమల గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం నిమ్స్ డైరెక్టర్ డా. బీరప్పను కలిసి ఆమెకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ తరఫున అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను భట్టి ఆదేశించారు.
Read Also: చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

