‘మా యూనివర్సిటీకి రావొద్దు’.. సీజేఐ సూర్యకాంత్‌కు షాక్

కలం, వెబ్ డెస్క్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు (CJI Justice Surya Kant) హైదరాబాద్ నల్సార్ విద్యార్థులు షాక్ ఇచ్చారు. త్వరలో జరిగే స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావొద్దని విన్నవించారు. వర్సిటీ అధికారులు సీజేఐకి పంపించిన ఆహ్వానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు 2025–26 బ్యాచ్‌కు చెందిన 450 మంది లా విద్యార్థులు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘జస్టిస్ సూర్యకాంత్ యువతను కాక్రోచ్‌లు అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీల వీడియోలు పరిశీలించాలని వారి తరఫు లాయర్లు కోరితే.. తనకు సమయం లేదంటూ తిరస్కరించారు. విద్యార్థుల పట్ల సీజేఐ వైఖరి బాధ కలిగించింది. అందుకే ఎంతో కీలకమైన, జీవితంలో ప్రాధాన్యత కలిగిన లా డిగ్రీలను ఆయన చేతుల మీదుగా తీసుకోవడానికి మేం ఇష్టపడటం లేదు. అందరం కలిసి మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నాం. యూనవర్సిటీ మా ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని ఆశిస్తున్నాం’ అని విద్యార్థులు పేర్కొన్నారు.

ఇంకా స్పందించని యూనివర్సిటీ..

విద్యార్థుల విన్నపంపై ఇంకా యూనివర్సిటీ వర్గాలు స్పందించలేదు. స్నాతకోత్సవ తేదీని ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా న్యాయ విద్యార్థులకు డిగ్రీలు అందించే కార్యక్రమానికి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తినే ముఖ్య అతిథిగా హాజరవుతుంటారు. ఈ సందర్భంగా వారికి న్యాయ వ్యవస్థ గురించి, అందులోని సవాళ్లు, అవకాశాల గురించి హితబోధ చేస్తుంటారు. సీజేఐ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోవడాన్ని విద్యార్థులు సైతం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. అలాంటిది ఆయన్నే రావొద్దని డిమాండ్ చేస్తుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>