Mobile Popup Ad
Mobile Popup Ad

కార్యకర్తల కష్టాన్ని ప్రభుత్వం ఎన్నటికీ మరువదు: భట్టి

కలం, వెబ్ డెస్క్: కార్యకర్తల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నటికీ మరువదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. గత పదేళ్ల కష్టకాలంలో పార్టీ జెండాను భుజాన వేసుకుని నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని ఈ ప్రజా ప్రభుత్వం గుర్తుపెట్టుకొని తగిన గౌరవం కల్పిస్తుందని చెప్పారు. నాడు కొందరు నేతలు పార్టీ విడిచి వెళ్ళినా, కాంగ్రెస్‌ను గుండెల్లో పెట్టుకుని కాపాడిన కార్యకర్తల త్యాగాల వల్లే నేడు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైందని వ్యాఖ్యానించారు.

ఖమ్మం స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA) నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పువ్వాళ దుర్గాప్రసాద్ కు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబాకు భట్టి (Bhatti Vikramarka) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వీరిద్దరూ తమ అనుభవంతో జిల్లా ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తూ ప్రాంతీయ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సంస్థల బలోపేతానికి, వనరుల కొరత లేకుండా చూడటానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లా మంత్రులు, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Read Also: పీసీసీ చీఫ్ గురించి త‌ప్పుడు వార్త‌ల‌పై ద‌ర్యాప్తు చేస్తాం: ఎంపీ మ‌ల్లు ర‌వి

Read Also: ఆమెకు రక్షణేది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>