బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. బీటీపీఎస్ కు పువ్వాడ, కేటీపీఎస్ కు వద్దిరాజు రవిచంద్ర..!

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో జరుగుతున్న పరిణామాలు, ఉత్పాదన పరిస్థితులపై క్షేత్రస్థాయి నిజానిజాలను తేల్చేందుకు బీఆర్​ఎస్​ పక్కా యాక్షన్ ప్లాన్‌ (BRS Thermal Power Inspection)తో రంగంలోకి దిగింది. బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక అధ్యయన బృందాలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పవర్ స్టేషన్లను సందర్శించనున్నాయి.

​ఈ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కీలక విద్యుత్ కేంద్రాల పరిశీలనకు బీఆర్ఎస్ అధిష్టానం కీలక నేతలను రంగంలోకి దించింది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం సందర్శించనుండగా, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ క్షేత్రస్థాయి పరిస్థితులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలోని బృందం పరిశీలించనుంది.

​విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత పనితీరు, ఉత్పాదన సామర్థ్యం, బొగ్గు నిల్వలు మరియు ఇతర సాంకేతిక పరిస్థితులను ఈ బృందాలు స్వయంగా పరిశీలించి వాస్తవాలను తెలుసుకోనున్నాయి. క్షేత్రస్థాయిలో లభ్యమైన వివరాలు, సమాచారం ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించి పార్టీ అధిష్టానానికి సమర్పించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>