కలం, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ 2026కు (T20 World Cup) ముందు టీమిండియాపై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణలు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసింది చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టో, మొన్నటి వరకు భారత్ రామంటూ టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ జట్టో కాదు. భారత్‌తో కలిసి టోర్నీకి వేదికగా నిలుస్తున్న శ్రీలంక క్రికెటర్. శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స (Bhanuka Rajapaksa) భారత ఆటగాళ్లు అందరిలా కాకుండా వేరే బ్యాట్లు ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించాడు.
భారత ఆటగాళ్ల బ్యాట్లు సాధారణ బ్యాట్లకన్నా మందంగా ఉండి, రబ్బరు పొర ఉన్నట్లుగా అనిపిస్తున్నాయని రాజపక్స (Bhanuka Rajapaksa) అభిప్రాయపడ్డాడు. అలాంటి బ్యాట్లు మార్కెట్‌లో లభించవని, ఇతర జట్ల ఆటగాళ్లకు అందుబాటులో ఉండవని రాజపక్స అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు భారత్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న సమయంలో రావడం గమనార్హం. గత రెండేళ్లుగా భారత్ ఏ టీ20 సిరీస్‌ను కోల్పోలేదని రికార్డులు చెబుతున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్‌ను ఓటమిలేకుండా గెలిచిన తర్వాత కూడా అదే జోరు కొనసాగుతోందని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రపంచకప్‌లో ముంబై వాంఖడే స్టేడియంలో (Wankhede Stadium) జరిగిన మ్యాచ్‌లో భారత్ అమెరికాపై విజయం సాధించింది. బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఒక దశలో 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అప్పుడే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్‌ను నిలబెట్టినట్లు తెలిపారు. ఆయన అజేయంగా 84 పరుగులు చేసి జట్టును 161 పరుగులకు చేర్చారని వివరించారు. తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అమెరికాను 132/9కే పరిమితం చేసినట్లు సమాచారం. దీంతో భారత్ 29 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ తదుపరి మ్యాచ్‌లో నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
Read Also: టైటాన్ ఆఫ్ ది ఇయర్‌గా గుకేష్
Follow Us On : WhatsApp


