బాల్య వివాహాలు, పోక్సో నేరాలపై కఠిన చర్యలు: జడ్జి రాజేందర్!

కలం, ఖమ్మం బ్యూరో: బాల్య వివాహాలకు (Child Marriages) పాల్పడినా, బాలలపై లైంగిక నేరాలకు (పోక్సో) ఒడిగట్టినా కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. రాజేందర్ హెచ్చరించారు. శుక్రవారం టేకులపల్లి మండలం తడకలపూడి గ్రామ పంచాయతీలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలు చిన్నారుల ఆరోగ్యం, విద్య, మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయని, వీటి నిర్మూలనకు గ్రామస్తులు, యువత, ప్రజాప్రతినిధులు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​చదువు మధ్యలోనే మానేసి గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జడ్జి సూచించారు. గ్రామంలో బడి మానేసిన పిల్లలను గుర్తించి సీడబ్ల్యూసీ, డీడబ్ల్యూఓ అధికారుల సమన్వయంతో వసతి గృహాల్లో చేర్పించి, తిరిగి విద్యావంతులను చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు అంబేద్కర్, ఎస్సై తిరుపతి, సర్పంచ్ బిక్షి రాములు, ఉపసర్పంచ్ వాసం సీత, అంగన్వాడీ సూపర్‌వైజర్ బి. నిర్మల, గ్రామ కార్యదర్శి దీప్తి, 1098 సూపర్‌వైజర్ లలిత, పారా లీగల్ వాలంటీర్లు చరణ్ కుమార్, బి. భారతి, పి. రాజకుమారి, వీవో ప్రతినిధి రత్నకుమారి, ఎయిడ్ ఎన్జీవో ప్రతినిధి మాన్‌సింగ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>