నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్​ ధర్నా.. ప్రధాని దిష్టిబొమ్మ దహనం

కలం, నాగర్ కర్నూల్: బిజెపి హటావో భారత్ బచావో అంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా (Congress Protest) నిర్వహించారు. అఖిల్ భారత కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేపట్ల అవమానంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ధర్నా, ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, డిసిసి జిల్లా అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను అవమానించడం దుర్మార్గం అన్నారు. ప్రశ్నించిన రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం అన్యాయం అని, బిజెపి తిరోగమన దిశగా పయనిస్తున్నదని విమర్శించారు. దేశాన్ని కులం మతం పేరుతో చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. పన్నెండు సంవత్సరాల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు బిజెపి ప్రభుత్వంలో మెరుగుపడలేదని, సైన్స్ పెరుగుతున్న కాలంలో కూడా కులవివక్ష మతం పేరుతో రాజకీయాలు చేయడం తిరోగమన చర్యగా విమర్శించారు.

మతం పేరుతో గద్దెనెక్కిన బిజెపిని గద్దె దించే వరకు రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు జాగృతం కావాలని, ప్రజలను జాగృతం చేయాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, పార్టీ టౌన్ అధ్యక్షుడు జక్కా రాజు, ఎస్సీ సెల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వంకేశ్వరం నిరంజన్, వినోద్, పార్టీ నాయకులు దండు నరసింహ, విజయ్ కుమార్ రెడ్డి, హబీబ్, వినోద్ జెట్టి ధర్మరాజు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>