ఉప్పొంగుతున్న గోదావరి.. అధికారులకు కలెక్టర్​ కఠిన ఆదేశాలు

​కలం, ఖమ్మం బ్యూరో : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద నీటిమట్టం 25 నుంచి 30 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉండటంతో, క్షేత్రస్థాయి అధికారులెవరూ తమ హెడ్‌క్వార్టర్స్ దాటి వెళ్లవద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) కఠిన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో వర్షాలు, వరద పరిస్థితులపై ఆరా తీశారు.

​వరద ఉద్ధృతి పెరుగుతున్నందున నిమజ్జన ప్రాంతాల వద్ద బారికేడింగ్, గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ (Collector Ankit) స్పష్టం చేశారు. అలాగే పాత వంతెనలు, ప్రమాదకర కల్వర్టులను పరిశీలించాలన్నారు. అందులో భాగంగా ములకలపల్లి వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను వినియోగించకుండా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తాగునీరు, మధ్యాహ్న భోజనం కలుషితం కాకుండా చూడాలని సూచించారు. పంటలు, ఇళ్ల నష్టంపై నిరంతరం పర్యవేక్షిస్తూ నివేదికలు అందించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>