పాస్‌బుక్ కోసం లంచం.. ఏసీబీ వ‌ల‌లో జీపీవో

క‌లం, వెబ్‌డెస్క్‌: ఓ వ్య‌క్తికి భూ బ‌ద‌లాయింపు చేసి పాస్‌బుక్ జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జీపీవోను ఏసీబీ (ACB) అధికారులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేట (Peddapeta) గ్రామ పంచాయతీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామ పరిపాలన అధికారి (GPO) దుర్గాప్రసాద్ పాస్‌బుక్ జారీ చేసేందుకు ఓ వ్య‌క్తి వ‌ద్ద‌ రూ.1.30 లక్షల లంచం డిమాండ్ చేశారు. అందులో మొదటి విడతగా రూ.80,000 తీసుకుంటూ నేడు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భూమి బదలాయింపు చేసి కొత్త పాస్‌బుక్‌ జారీ చేసేందుకు ఆయన ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

పెద్దపేట శివారులో ఫిర్యాదుదారు నుండి డబ్బులు తీసుకుంటున్న సమయంలో జీపీఓ దుర్గాప్రసాద్, అతనికి సహకరించిన రాజేందర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు రాజేందర్ చేతికి లంచం డబ్బులు అందజేశాడు. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>