ఎక్కువ కాలం బ‌త‌క‌వ‌న్న జ్యోతిష్యుడు.. ఉరేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి!

క‌లం, వెబ్ డెస్క్‌: మూఢ నమ్మకం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చదువుకొని, సాఫ్ట్‌వేర్ (Software) ఉద్యోగం చేస్తున్న యువ‌తి జ్యోతిష్యుడి (Astrologer) మాటలకు భయపడి బలవన్మరణానికి (Suicide) పాల్పడటం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. బెంగళూరు (Bengaluru)లోని యశ్వంతపురలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

విద్యాజ్యోతి (Vidyajyoti) అనే యువతి బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె ప్ర‌స్తుతం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంలో ఉంది. తాను ప్రేమించిన యువకుడిని తొమ్మిది రోజుల క్రితమే పెళ్లి చేసుకుంది. కొత్త జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో ఆమెకు ఒక జ్యోతిష్యుడు పరిచయమయ్యాడు. విద్యాజ్యోతి జాతకాన్ని చూసిన జ్యోతిష్యుడు ఆమెను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. నువ్వు ఎక్కువ కాలం బ‌తకవు, నీకు ఆయుష్షు లేదంటూ బెదిరించాడు. ఆ గండం నుంచి గట్టెక్కాలంటే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని చెప్పాడు. పూజ‌ల కోసం జ్యోగిష్యుడు వింత కండిషన్లు పెట్టాడు.

తొమ్మిది రోజుల పాటు కఠినంగా పూజ చేయాల‌ని, చివరి రోజైన శుక్రవారం విద్యాజ్యోతి త‌న‌ మెడలోని మంగళసూత్రాన్ని తీసి అమ్మవారికి సమర్పించాల‌ని సూచించాడు. అలా చేస్తేనే ప్రాణ గండం తప్పుతుందని నమ్మబలికాడు. జ్యోతిష్యుడి మాటలు విన్న విద్యాజ్యోతి 9 రోజుల పాటు పూజలు చేసింది. చివరి రోజు అమ్మవారికి తాళి తీసివ్వడానికి ముందు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఉన్న‌త చ‌దువులు చ‌దువుకున్న అమ్మాయి జ్యోతిష్యుడి మాట‌ల‌కు భ‌య‌ప‌డి ఆత్మ‌హ‌త్య (Bengaluru Software Suicide) చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయంగా మారింది. అయితే విద్యాజ్యోతి ఆత్మ‌హ‌త్య చేసుకుందా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్త‌త‌.. సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు వాయిదా

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>