కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు(Bengaluru) లో ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఇంటికి చెందిన మగ పిల్లి, పక్కింటి ఆడ పిల్లిని గర్భవతిని చేయడంతో మొదలైన వివాదం చివరకు పోలీసుల వరకు వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత ఆడ పిల్లి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఆడ పిల్లి యజమానులు ఆ చిన్న పిల్లులను తీసుకుని మగ పిల్లి యజమానుల ఇంటికి వెళ్లి, ‘మీ పిల్లి తండ్రి కాబట్టి మీరు ఈ పిల్లలను పెంచాలి’ అంటూ వాదనకు దిగారు.
అయితే మగ పిల్లి యజమానులు దీనికి అంగీకరించలేదు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో చివరకు ఈ విషయం పోలీసుల దృష్టికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ విషయంలో ఎవరికీ బలవంతంగా బాధ్యతలు మోపలేమని స్పష్టం చేశారు. చివరకు పరస్పర అంగీకారంతో ఆ నాలుగు పిల్లులను ఒక మూడో వ్యక్తి ఇంటికి తరలించాలని నిర్ణయించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న విషయమే అయినా పెద్ద వివాదానికి దారితీయడంతో ఈ సంఘటనపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.
Read Also: అసలైన నిద్ర రహస్యం అదే.. ఆలియా భట్ ప్రశ్నకు సద్గురు సమాధానం!
Follow Us On: Instagram

