15 ఏళ్ల ప్రయాణానికి ముగింపు.. స్టోక్స్ రిటైర్మెంట్ షాక్!

కలం, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. న్యూజిలాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగుతున్న మూడో టెస్టు ముగిసిన వెంటనే తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకనున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రకటనతో ఇంగ్లండ్ క్రికెట్‌లో ఓ కీలక అధ్యాయానికి తెరపడనుంది. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు స్టోక్స్ తన నిర్ణయాన్ని తోటి ప్లేయర్లకు తెలిపాడు.

ఈ నిర్ణయం వెనుక కారణాల గురించి తర్వాత మాట్లాడతానని, ప్రస్తుతం మాత్రం జట్టు కోసం మరోసారి పూర్తి శక్తితో పోరాడాలనేదే తన కోరిక అని చెప్పాడు. చివరి రెండు రోజులు ప్రతి ఆటగాడు జట్టు కోసం వంద శాతం ఇవ్వాలని కోరాడు. ఫలితం ఎలా వచ్చినా, అందరూ తమ శక్తిమేరకు పోరాడారనే సంతృప్తితో మైదానం వీడాలనేదే తన ఆకాంక్ష అని వివరించాడు. భావోద్వేగాలను పక్కనబెట్టి ఇప్పుడు మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాలని సహచరులకు సూచించాడు.

స్టోక్స్ (Ben Stokes) కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ క్షణాలు ఉన్నాయి. 2019 ప్రపంచకప్ ఫైనల్లో 84 పరుగులతో ఇంగ్లండ్‌ను తొలి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది యాషెస్ సిరీస్‌లో హెడింగ్లే టెస్టులో అజేయంగా 135 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై ఒక వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. ఆ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>