ఊరికి వెళ్లొచ్చేసరికి 30 తులాల బంగారం చోరీ

కలం, డెస్క్ : హైదరాబాద్ పరిధిలో వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 30 తులాల బంగారం చోరీ (Gold Theft) సంచలనంగా మారింది. బేగంపేట శ్యామ్ లాల్ పరిధిలో ఓ వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె శివరాత్రి సందర్భంగా తన కూతురు ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి 30 తులాల బంగారం చోరీ చేశారు. ఓ బిల్డింగ్ లోని మూడో అంతస్తులో ఆమె నివసిస్తోంది. ఎవరూ లేనిది చూసి తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డు అయ్యాయని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>