కలం, వెబ్ డెస్క్ : అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా (BCCI Reward) ప్రకటించింది. చాంపియన్లుగా నిలిచిన టీమ్ ఇండియా ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బందితో పాటు సెలక్టర్లకు కలిపి మొత్తం 7.5 కోట్ల రూపాయల నగదు బహుమతిని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) ప్రకటించారు.
హరారే వేదికగా మన యువ ఆటగాళ్లు కనబరిచిన అద్భుత ప్రదర్శన పట్ల దేశం మొత్తం గర్విస్తోందని ఆయన కొనియాడారు. భారత్ లో నేడు ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే సీనియర్ జట్టుకు కూడా ఇది గొప్ప ప్రోత్సాహాన్నిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: పాక్ బాయ్‌కాట్ వివాదం.. అందుకు ఛాన్స్ లేదన్న ఇర్ఫాన్ పఠాన్
Follow Us On: X(Twitter)


