నిర్మల్‌లో ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో ఆదివారం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని(Free Mega Cancer Screening Camp) నిర్వహించారు. ఈ శిబిరంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు చెందిన ప్రత్యేక మొబైల్ బస్ యూనిట్‌తో పాటు అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. నిపుణులైన వైద్య బృందం పాల్గొని ప్రజలకు క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ (Lions club)  అధ్యక్షుడు ఎస్. వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ.. శిబిరంలో 300 మందికి పైగా క్యాన్సర్ ప్రాథమిక స్క్రీనింగ్‌తో పాటు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాల్సిన ప్రాధాన్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఛైర్మన్ కాళగిరి గంగా రెడ్డి, కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి పూదరి విజయ్ కుమార్, జోన్ ఛైర్‌పర్సన్ కె. చంద్ర మోహన్ రెడ్డితో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>