అ ‘పూర్వం’.. ఒక్కచోటే 7 వేల మంది ఆత్మీయ సమ్మేళనం

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపులోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా చెదరని స్నేహబంధాలు, మరువని గురుభక్తి, మదిలో పదిలంగా నిలిచిన బాల్య జ్ఞాపకాలు ఒకే వేదికపై ఆవిష్కృతమయ్యాయి. సుమారు 65 సంవత్సరాల పదో తరగతి బ్యాచుల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక (Grand Reunion) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 6 నుంచి 7 వేల మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హాజరై పాఠశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తారు.

వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా తరలివచ్చి తమ చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. దశాబ్దాల తర్వాత ఒకరినొకరు చూసుకున్న వారు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల రోజులు, అప్పటి ఆటలు, స్నేహాలు, గురువుల బోధనలు, గ్రామీణ జీవన అనుభవాలను గుర్తుచేసుకుంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.

వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం..

సమ్మేళనంలో భాగంగా వెల్నెస్ హాస్పిటల్స్, నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులకు ఉచితంగా షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కన్సల్టెంట్ వైద్యులు పరీక్షల ఫలితాలను పరిశీలించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.

అదేవిధంగా పూర్వ విద్యార్థులందరికీ ఉచితంగా వెల్నెస్ హాస్పిటల్స్ వారి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ హెల్త్ కార్డులను ఉచితంగా అందజేశారు. భారీ సంఖ్యలో హాజరైన పూర్వ విద్యార్థులకు వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. వెల్నెస్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను నిర్వాహకులు, పూర్వ విద్యార్థులు అభినందించారు. వయోభారంతో బాధపడుతున్న పలువురికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

తరతరాలను కలిపిన ఆత్మీయ బంధం

65 సంవత్సరాల పదో తరగతి బ్యాచుల పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా ఒకే చోట కలుసుకోవడం అరుదైన ఘట్టమని పలువురు పేర్కొన్నారు. కాలం మారినా స్నేహం మారదని, పాఠశాల అనుబంధం జీవితాంతం నిలిచిపోతుందని ఈ సమ్మేళనం చాటిచెప్పింది. చదువుకున్న పాఠశాల, చిన్ననాటి స్నేహితులు, అప్పటి గురువులు, గ్రామీణ జీవన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా ముచ్చటించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు పాత ఫొటోలు, జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకున్నారు.

ఈ సమ్మేళనం కేవలం పూర్వ విద్యార్థుల కలయికగా కాకుండా తరతరాలను కలిపే ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలిచింది. వేలాది మంది పాల్గొనడంతో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రోజంతా సందడి నెలకొంది. గ్రామస్తులు, నిర్వాహకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని వెల్నెస్ హాస్పిటల్స్ ప్రతినిధులు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని, ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు భవిష్యత్తులోనూ సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి, డాక్టర్లు స్పందన, ఆపరేషన్ జనరల్ మేనేజర్స్ మహమ్మద్ అక్బర్ ఖాన్, హరికృష్ణ గౌడ్, ఆపరేషన్స్ ఏజీఎం వినోద్ కుమార్, ఏరియా జనరల్ మేనేజర్ రాజశేఖర్ శర్మ, తాళ్ల మహేష్ గౌడ్, బండారి నరసింహులు, శేఖర్ గౌడ్, రవి, నర్సింగ్ హెచ్‌ఓడీ శివాజీ, ఫ్యామిలీ హెల్త్ కార్డు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>