ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఆర్కే పురంలోని సత్య నికేతన్ ప్రాంతంలో హాస్టల్ భవనం కుప్ప కూలిపోయిన (Hostel Collapses) ఘటన కలకలం రేపుతోంది. శిథిలాల కింద ఏకంగా 50 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భవనం శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ.. NDRF సిబ్బందితో పాటు ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నారని.. నిరంతరం సమీక్షిస్తున్నట్లు వివరించారు. బిల్డింగ్ కూలుతున్న సమయంలో చాలా మంది ‘ప్లీజ్ కాపాడండి..’ అంటూ కేకలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఘటన జరిగిన 20 నిమిషాల తరువాత ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>