‘స్మో-కింగ్’ వచ్చేస్తున్నాడు.. NBK 111 నుంచి క్రేజీ అప్‌డేట్

కలం, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న ‘NBK 111’ మూవీ టీమ్ మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించిన మాస్ ఎలివేషన్‌ను సూచిస్తూ సోషల్ మీడియాలో ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది.“ఇన్‌బిల్ట్ స్వాగ్.. అన్‌ఫిల్టర్డ్ యాటిట్యూడ్.. అన్‌టచబుల్ ఆరా” అంటూ ఇంట్రెస్టింగ్  పోస్టు చేసింది.

నేడు సాయంత్రం 6:40 గంటలకు ‘NBK 111’ మూవీ టైటిల్, రిలీజ్ డేట్‌కు సంబంధించి ప్రత్యేక అప్‌డేట్ రాబోతుందని మూవీ టీం ప్రకటించింది. “Wait for the smo-KING to arrive” అంటూ చేసిన ఈ పోస్టు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరోసారి బాలయ్య సినిమా కోసం మాస్ బీట్స్ సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>