Mobile Popup Ad
Mobile Popup Ad

ఇళ్ల‌కు వెళ్లిపోండి.. బాస‌ర IIIT విద్యార్థుల‌కు యాజ‌మాన్యం ఆదేశాలు!

క‌లం, వెబ్ డెస్క్‌: బాస‌ర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. యాజ‌మాన్యం అక‌స్మాత్తుగా సెల‌వులు ప్ర‌క‌టించ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఒక వైపు ప‌రీక్ష‌లు జ‌రుగుతుండ‌గానే యాజ‌మాన్యం సెల‌వులు ప్ర‌క‌టించి, విద్యార్థులు ఇళ్ల‌కు వెళ్లాల‌ని ఆదేశించింది. పీయూసీ 1,. ఇంజినీరింగ్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర విద్యార్థుల‌కు సెల‌వులు ఇచ్చారు. అసాధార‌ణ సెల‌వులు అంటూ ప్ర‌క‌ట‌న జారీ చేశారు. అయితే సెల‌వులు ఎందుకు ఇచ్చార‌న్న దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఇటీవ‌ల ట్రిపుల్ ఐటీ (Basara IIIT) విద్యార్థిని తేజ‌స్విని మృతితో విద్యార్థులు ఆందోళ‌న చేయ‌డంతో కాలేజీలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తేజ‌స్విని త‌ల్లిదండ్రులు మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌రుస సెల‌వులు ఇవ్వ‌డంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌ళ్లీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయ‌న్న దానిపై విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Read Also: ఇరాన్ టు ఇండియా: రవాణా సవాల్

Follow Us On: Facebook

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>