శిశువుకు తల్లిపాలే బలం

కలం, నిర్మల్: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కస్బా బాగులవాడలో శుక్రవారం అవగాహన కార్యక్రమం జరిగింది. తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల భాగంగా తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారమన్నారు. పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వడం, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలన్నారు. అనంతరం రెండేళ్ల వరకు అనుబంధ ఆహారంతోపాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంచాల శ్రీకాంత్ యాదవ్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>