పోడు భూముల వ్యవహారంలో సంయమనం పాటించాలి.. నిర్మల్ కలెక్టర్

కలం, నిర్మల్: కడెం మండలం ఉడుంపూర్ (Udumpur) గ్రామంలో పోడు భూముల వివాదం నేపథ్యంలో అటవీ అధికారులు, గ్రామస్తులు సంయమనం పాటించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శుక్రవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉడుంపూర్ గ్రామస్తులు, అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పోడు భూముల రైతులు, అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ విడివిడిగా చర్చించి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలు తలెత్తినప్పుడు పరస్పర చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సమస్యల పరిష్కారానికి జిల్లా పరిపాలన పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. గ్రామస్తులు శాంతియుత వాతావరణాన్ని కాపాడుతూ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని, ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డీఓ దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ఉడుంపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>