108 వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు.

కలం, బాసర: బాసర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ (108 Ambulance) వాహనాన్ని సంబంధిత అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈఎంఆర్ఐ ప్రోగ్రాం మేనేజర్ సంపత్, కోఆర్డినేటర్ లింగాచారి అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, అత్యవసర సేవలకు అవసరమైన సామగ్రిని పరిశీలించారు. వాహనంలో అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా, అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు సిద్ధంగా ఉందా అనే అంశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీలు నవీన్, శ్రీకాంత్, పైలట్ దిలీప్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>