కలం, వెబ్ డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను దోచుకునేందుకే రాహుల్ వచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ కోర్స్ ముగింపు కార్యక్రమానికి రాహుల్ వచ్చారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి రూ.10,000 కోట్లు ఇవ్వగలమని, అందులో తెలంగాణ నుంచే రూ.1,000 కోట్లు అందించగలమని చెప్పారంటూ ఆరోపించారు. ఇది రాజకీయ పర్యటననా? లేక వసూళ్ల సమీక్షనా? అంటూ బండి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: డీసీసీ మీటింగ్‌లో మంత్రులకు అవమానం..!
Follow Us On: X(Twitter)

