Mobile Popup Ad
Mobile Popup Ad

సూర్య – వెంకీ అట్లూరి న్యూ మూవీ టైటిల్ రివీల్

కలం, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ మూవీ రాబోతుందనే విషయం తెలిసిందే. వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకు బ్లాక్‌బస్టర్ హిట్ కావాలి. దీనితో లక్కీ భాస్కర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేస్తున్నారు. సూర్య కెరీర్‌లో 46వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ బిగ్గెస్ట్ మూవీకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath and Sons) అనే క్లాసిక్ టైటిల్‌ను  ఫిక్స్ చేశారు. 2026 జూలైలో ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్షేషన్ జీ.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. మలయాళ క్యూట్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. 

Read Also: సతీమణితో స్వగ్రామం చేరుకున్న విజయ్ దేవరకొండ

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>