Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు ‘టిఫిన్ బైఠక్’

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆధ్వర్యంలో 13న ‘స్వచ్చ పాఠశాల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దానిలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 2 వేల ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయబోతున్నారు. దీని కోసం రేపు ఉదయం 9 గంటలకు అన్ని స్కూళ్లలో ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించనున్నారు. ఎవరి టిఫిన్ వారే తెచ్చుకుని స్కూల్ ఆవరణలో సమావేశమై స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దానిపై చర్చించనున్నారు. ఒక్కో పాఠశాలకు సుమారు 25 మందిని కేటాయించనున్నారు. 13న ఎవరికీ వారు సొంతంగా చీపురు, క్లాత్, బకెట్, మగ్ తీసుకొచ్చి తరగతులను శుభ్రం చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం రేపు చిగురుమామిడి మండలం రేకొండలో టిఫిన్ బైఠక్‌కు హాజరు కానున్నారు. పార్టీల జెండా, ఎజెండా, కండువాలను పక్కకు పెట్టి.. అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

జమ్మికుంటలో బండి సంజయ్ పర్యటన..

కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంటలో పర్యటించారు. శిశు మందిర్ పాఠశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో సమావేశమయ్యారు. మోదీ పాలనలో వైద్య రంగంలో జరిగిన అభివ్రుద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట ప్రెసిడెంట్ డాక్టర్ కె.తిరుపతి, ఎథిక్స్ ఛైర్మన్ సీహెచ్.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ బి.రమేశ్, పి.శ్రీకాంత్, కె.దేవేందర్ రెడ్డి, మురళి, ప్రవీణ్, సంపత్, సాయి, కిశోర్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జమ్మికుంటలో పాకాల రవీందర్ రెడ్డి ఇంట్లో పలువురు ప్రముఖులను కలిశారు. మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలపై ముద్రించిన పుస్తకాలను అందజేశారు. ఈ పర్యటనలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>