Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీ పర్యటన.. సభా వేదికపై బండి సంజయ్ కంటతడి

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ పర్యటన వేళ సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న సభ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కంటతడి పెట్టారు. ప్రధాని మోదీ మరికాసేపట్లో సభకు రానున్న వేళ బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను పార్టీ తలవంచుకునే పని ఎప్పుడూ చేయను.. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. తమ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోం అని హెచ్చరించారు.

ఈ మేరకు ఏదో చేసి బండి సంజయ్ ను ఇబ్బంది పెట్టాలనుకుంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. తాను ఫాంహౌజ్ లో ఎలుక‌ను కాదని వ్యాఖ్యానించారు. తాను అయ్య పేరు, తాత పేరు చెప్పుకొని రాజ‌కీయాల్లోకి రాలేదని.. పార్టీ జెండాను భుజాల‌పై పెట్టుకొని కార్య‌క‌ర్త‌గా, మోదీ శిష్యుడిగా ఎదిగానని వెల్లడించారు. ఈ రోజు నుండే తెలంగాణ రాష్ట్రంలో ధ‌ర్మం ఆధారంగా జై శ్రీ‌రామ్… జై తెలంగాణ నినాదాలతో వెళ్దామని పిలుపునిచ్చారు. కాగా, తన కొడుకు బండి సాయి భగీరథ్ పై వస్తున్న ఫోక్సో వార్త‌ల‌పై పరోక్షంగా బండి సంజయ్ కంటతడి పెట్టినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>