కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుండేదని .. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘోరంగా దిగజారిందని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లీస్తుందని ఆరోపించారు. కొన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాండ్ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా పంట కొనుగోలు బాధ్యత మూమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వానిదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం చేతకావడం లేదుగాని.. ఢిల్లీకి మూటలు తీసుకోపోవడం కాంగ్రెస్ కు తెలుసనని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పాలన అంతా కలెక్షన్లు.. కమిషన్ల మీదే నడుస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని చెప్పారు.
ఒక్కసారి అధికారం ఇవ్వండి
తెలంగాణలో తమకు ఒక్కసారి అధికారం ఇవ్వాలని కేంద్రం బండి సంజయ్ ప్రజల్ని కోరారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితులు మారలేదన్న బండి సంజయ్.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అయితే బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లిందని చెప్పారు.

