Mobile Popup Ad
Mobile Popup Ad

గ్రేటర్ వరంగల్‌లో తెలంగాణ దినోత్సవ వేడుకలు

కలం, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా GWMC ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి (Collector Chahat Bajpai)  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంక్షిప్తంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, నగర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయ ప్రాంగణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>