రేవంత్ వర్సెస్ కేటీఆర్: బిగ్ డిబేట్.. ముహూర్తం ఫిక్స్ !!

కలం, వెబ్ డెస్క్: అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరుపార్టీల ముఖ్య నేతలు బహిరంగ చర్చలకు సవాళ్ళు విసురుకుంటూ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (Revanth Reddy – KTR) మధ్య చర్చ జరిగితే ఎలా ఉంటుంది? ఆ బిగ్ డిబేట్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ అభిమానులకు బాగా మసాలా దట్టించిన స్పైసి దమ్ బిర్యానీ తిన్న కిక్కెక్కుతుంది అనడంలో అతిశయోక్తి ఉండదు.

మాజీ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ (Bakka Judson) సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేశారు. ఇప్పటివరకూ రాష్ట్ర మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య జరిగిన ఛాలెంజ్ వార్ ఇప్పుడు సీఎం వర్సెస్ కేటీఆర్ (Revanth Reddy – KTR) తరహాగా మారేలా బక్క జడ్సన్ చొరవ తీసుకున్నారు. ఇద్దరు బడా లీడర్ల మధ్య బిగ్ డిబేట్ పెట్టడానికి ప్లాన్ చేశారు. జూలై 4వ తేదీ ఉదయం వారిరువురి మధ్య చర్చ జరిపించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరనున్నారు. అనుమతి రాగానే బహిరంగ డిబేట్ జరిగేలా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయనున్నారు.

ఒకవేళ అనుమతి రాకపోతే జూమ్ ద్వారానే సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ హాజరయ్యేలా వర్చువల్ మీటింగ్ కోసం టైమ్ ఫిక్స్ చేశారు. జూలై 4, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జూమ్ మీటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ లింక్ వివరాలను అటు సీఎం రేవంత్‌రెడ్డికి, ఇటు కేటీఆర్‌కు పంపారు. అసలు ఈ డిబేట్ లో పాల్గొనేందుకు నేతలు సిద్ధమేనా? జడ్సన్ వారిని ఒప్పించి ఒకే వేదికపైకి తీసుకురాగలరా? అదే జరిగితే రాష్ట్ర రాజకీయ పరిణామాలు మరింత హీటెక్కడం పక్కా.

Read Also: అక్క‌డ స్టింగ్ డ్రింక్ బ్యాన్.. అసెంబ్లీలో నిర్ణ‌యం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>