Mobile Popup Ad
Mobile Popup Ad

రొనాల్డోకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే వెనక్కి!

కలం, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ 2026 నాకౌట్ పోరులో ఊహించని సంచలనం నమోదైంది! పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు (Cristiano Ronaldo) కోచ్ రాబర్టో మార్టినెజ్ గట్టి షాక్ ఇచ్చారు. ఈ టోర్నీలోనే మొదటిసారిగా రొనాల్డోను మ్యాచ్ ముగియక ముందే మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఈ సంచలన నిర్ణయం తర్వాతే క్రొయేషియాపై పోర్చుగల్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి, రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకెళ్లింది. అసలు ఏం జరిగిందంటే.. అంతకుముందు ఉజ్బెకిస్తాన్‌పై రొనాల్డో రెండు గోల్స్ కొట్టి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించారు. కానీ డీఆర్ కాంగో, కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లు డ్రా అవ్వడానికి రొనాల్డో వైఫల్యమే కారణమంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

క్రొయేషియాతో జరిగిన ఈ చావో రేవో మ్యాచ్‌లో కూడా రొనాల్డో ఆట తీరు మారలేదు. అయితే మ్యాచ్ రెండో భాగంలో డిఫెండర్ రెనాటో వీగా పుణ్యమా అని పోర్చుగల్‌కు ఒక పెనాల్టీ దక్కింది. అంతవరకు ప్రత్యర్థి బాక్స్‌లో కనీసం బంతిని కూడా తాకలేకపోయిన రొనాల్డో.. 68వ నిమిషంలో వచ్చిన ఈ పెనాల్టీని గోల్‌గా మార్చారు. వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో రొనాల్డోకు ఇదే తొలి గోల్ కావడం విశేషం. కానీ ఈ ఒక్క గోల్ మినహా రొనాల్డో ఆట అస్సలు బాలేదు.

సహచర మిడ్‌ఫీల్డర్ల వేగాన్ని అందుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. రొనాల్డో (Cristiano Ronaldo) వల్ల మ్యాచ్ చేజారిపోతుందని గ్రహించిన కోచ్ మార్టినెజ్.. గుండె రాయి చేసుకుని ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. 81వ నిమిషంలో రొనాల్డోను సబ్‌స్టిట్యూట్ చేసి, రూబెన్ నెవెస్‌ను మైదానంలోకి దించారు. రొనాల్డో స్థానంలోకి గొన్సాలో రామోస్ వచ్చారు. కోచ్ నమ్మకాన్ని రామోస్ వంద శాతం నిజం చేసి చూపించారు. మ్యాచ్ ముగుస్తుందనగా స్టాపేజ్ టైమ్‌లో రామోస్ అద్భుతమైన హెడర్ గోల్‌తో క్రొయేషియా కోటను బద్దలు కొట్టారు.

రొనాల్డో చేయలేని పనిని రామోస్ కేవలం కొద్ది నిమిషాల్లోనే చేసి చూపించారు. వరల్డ్ కప్‌లో ప్రతి 37 నిమిషాలకు ఒక గోల్ లేదా అసిస్ట్ చేస్తున్న రామోస్.. పోర్చుగల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మారిపోయారు. రౌండ్ ఆఫ్ 16లో బలమైన స్పెయిన్‌తో పోర్చుగల్ తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఫామ్‌లో లేని రొనాల్డోను పక్కన పెట్టి రామోస్‌కే కోచ్ మార్టినెజ్ బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>