epaper
Wednesday, February 18, 2026
epaper

బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యం : ఆదిత్యనాథ్​

కలం, వెబ్​డెస్క్​: ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బారాబంకీలోని శ్రీరామ్​ జానకీ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అయోధ్యలో బాబ్రీ పునర్నిర్మాణం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. ‘ బాబ్రీ (Babri Masjid) నిర్మాణాన్ని మళ్లీ కట్టాలని కలలు కనేవాళ్లకు ఒక్కటే చెప్పాలి. వాళ్లు కోరుకుంటున్న ఖయామత్ (ఇస్లాం ప్రకారం ప్రపంచం అంతమయ్య రోజును ఖయామత్​ అంటారు) రోజు ఎప్పటికీ రాదు. దానికోసం ఎదురుచూస్తూ బతకొద్దు. హిందుస్థాన్​లో సరిగ్గా జీవించడం నేర్చుకోండి. ఈ దేశ చట్టాలను పాటించండి’ అని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించి, దాని ప్రకారం జీవిస్తే మేలు జరుగుతుంది. లేకపోతే చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లు నేరుగా జన్నత్(స్వర్గం)​ వైపు నడిచే పరిస్థితి తప్పదు ఆయన హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తూ కూడా జన్నత్​కు చేరుకుంటామని అనుకోవడం కల అని, అవి ఎప్పటికీ నెరవేరవని యోగి స్పష్టం చేశారు.

అలాంటి వాళ్లను రాముడు మర్చిపోయాడు..

రాముడు, దేవుడు విషయంలో కొంతమంది అవకాశవాద దృక్పథంతో వ్యవహరిస్తున్నారని ఆదిత్యనాథ్​ విమర్శించారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే రామున్ని తలచుకొని, మిగిలిన సమయంలో మర్చిపోతున్నారని అన్నారు. అలాంటి వాళ్లను రాముడు కూడా మర్చిపోయాడని వ్యాఖ్యానించారు. రామ భక్తులపై కాల్పులు జరిపినవాళ్లు, రామసేవకు అడ్డంకులు కలిగించిన ద్రోహులకు ఈ దేశంలో ఇక చోటు లేదని యోగి ఆదిత్యనాథ్ ​(Yogi Adityanath) స్పష్టం చేశారు.

Read Also: ఎంపీలే పొరపాటు చేస్తే… పార్లమెంటులో జరిగిందిదే..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>